
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కేసు నమోదయింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నారాయణపూర్ గ్రామా నికి చెందిన మాణిక్య రాజుకు సికింద్రా బాద్ బాలాజీ నగర్ కు చెందిన పుట్నాల భవానికి 8 ఏళ్ల కింద వివాహం జరగగా నాలుగున్నర సంవత్సరాల పాప ఒకటి న్నర సంవత్సరాల బాబు ఉన్నారు. భార్యా భర్తలు గొడవపడి ఐదు నెలలుగా వేరుగా ఉంటున్నారు.
కుటుంబీకులు నచ్చజెప్పి సోమవారం నారాయణపూర్ లో వదిలి వెళ్లారు. మంగళవారం బాబుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం భార్యపిల్లలతో వచ్చి వారిని అక్కడ వదిలి మాణిక్య రాజ్ డ్రైవింగ్ కు వెళ్లాడు. భవాని తన పిల్లలతో మళ్లీ వస్తా ననిచెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదనిభర్త కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.