కొండాపూర్ లో మహిళ దారుణ హత్య

కొండాపూర్ లో మహిళ దారుణ హత్య

జగిత్యాల జిల్లా కొండాపూర్ లో దారుణం జరిగింది. గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు మాధవి అనే మహిళను దారుణంగా హత్య చేశారు. నిన్న కూలీ పనులకు వెళ్లిన… మాధవి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెతుకుతుండగా… గ్రామ శివారులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.  మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాధవి భర్త గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె చనిపోవడంతో… ఇద్దరు ఆడపిల్లు ఆనాథలుగా మారారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.