నాపై అత్యాచారం చేసి వీడియో తీశాడు.. మాజీ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

నాపై అత్యాచారం చేసి వీడియో తీశాడు.. మాజీ ఎమ్మెల్యేపై మహిళ ఫిర్యాదు

ఎంత దారుణం.. తొమ్మిది మంది ఓ మహిళపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలపై కూడా అత్యాచారం చేశారు.. ఆమె యుక్త వయసులో ఉన్న ఆమె కూతురిని వేధించారు. మేం పెద్ద మనుషులం.. ఈ విషయం ఎవరికైనా చెప్పారా... చచ్చిపోతారు అని బెదరించారు. తరుచుగా వారి రూం కు రావాలని.. అమ్మాయిలను సప్లయ్ చేయాలని హుకుం జారీ చేశారు. భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం  వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై మాజీ ఎమ్మెల్యే, తోపాటు 8 మంది అత్యాచారం చేసిన ఘటన రాజస్ఠాన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

రాజస్థాన్ లోని బార్మర్ మాజీ ఎమ్మెల్యే మేవరం జైన్, ఆర్ పీఎస్ అధికారి ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ తో సహా తొమ్మిది మంది తనపై అత్యాచారం చేశారని తన కుమార్తెను వేధించారని బుధవారం (డిసెంబర్20) జోథ్ పూర్ లో ని రాజీవ్ గాంధీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో జైన్ తో పాటు మరో 8మందిపై సామూహిక అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలతో నివేదిక దాఖలు చేసినట్టు స్టేషన్ హౌజ్ ఆఫీసర్  తెలిపారు. 

గత మూడేళ్లుగా తనపై జైన్ అత్యాచారం చేస్తున్నాడని..జైన్ కు పరిచయం చేసిన రామ్ స్వరూప్ ఐదేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆమో ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తన తండ్రి ఆనారోగ్యం కారణంగా ఐదేళ్ల క్రితం బార్మర్ కు చెందిన రామ్ స్వరూప్ తో పరిచయం ఏర్పడిందని.. తండ్రి వైద్యం విషయంలో సాయం చేస్తానని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మహిళ ఆరోపిస్తోంది. ఆమె బలహీనత ఆసరగా ఆమెపై అత్యాచారం, వీడియో రికార్డింగ్ చేసి లైంగికంగా దోచుకోవడం కొనసాగించారు జైన్ తో పాటు అనుచరులు . 

యుక్త వయసులో ఉన్న తన కూతురిని కూడా వేధించారని.. ఆమె స్నేహితులలో ఒక అమ్మాయిపై కూడా అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదులో తెలిపింది. నిందితులు  ఈ విషయం ఎక్కడైనా, ఎవరికైనా చెప్పొద్దని బెదిరించారని.. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.