ఉన్నోళ్ల పిల్లలు కాబట్టి వదిలేస్తారా ?

ఉన్నోళ్ల  పిల్లలు కాబట్టి వదిలేస్తారా ?

రాష్ట్రంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై డీజీపీకి మహిళా కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ బృందంలో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్, కొండా సురేఖ, తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగ్గా జరగడం లేదన్న మహిళా బృందం.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళలపై  అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై పోలీసులు కఠినంగా వ్యవరించాలన్న వారు.. హైదరాబాద్ లో చాలా పబ్స్ అక్రమంగా నడుస్తున్నాయని, ప్రశ్నించిన వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక పై గ్యాంగ్ రేప్ జరిగితే రాష్ట్ర మహిళా మంత్రులు ఎక్కడికి పోయారు ? జాగృతి మహిళా అధ్యక్షురాలు కవిత.. బాలిక రేప్ కేసుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? బాలిక రేప్ పై మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీ అయ్యారని, పేద వాళ్లు నేరాలకు పాల్పడితే ఎన్ కౌంటర్ చేస్తారు... ధనవంతుల పిల్లలు నేరాలు చేస్తే వదిలేస్తున్నారని విమర్శించారు.