క‌రోనా అనుమానం : భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త

క‌రోనా అనుమానం : భార్యను ఇంట్లోకి రానివ్వని భర్త

బలియా: క‌రోనా మ‌హ‌మ్మారితో సొంత భార్య‌నే ఇంట్లోకి అనుమ‌తించ‌లేదు ఓ వ్య‌క్తి. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో జ‌రిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనాను తరిమికొట్టేందుకు సోష‌ల్ డిస్టెన్స్ పాటించడం చాలా అవసరమైన క్ర‌మంలో..ఓ వ్యక్తి పుట్టింటి నుంచి వచ్చిన తన భార్యను ఇంట్లోకి రానీయలేదు. దీంతో ఈ విష‌యం స్థానికంగా క‌లిచి వేసింది.

యూపీలోని బలియా జిల్లాకు చెందిన‌ బబితా, గణేశ్‌ ప్రసాద్‌కు ఐదేళ్ల క్రితం పళ్లైంది. బబిత రెండు నెలల క్రితం బీహార్ లోని త‌న‌ పుట్టింటికి వెళ్లింది. అయితే బబిత బుధవారం బలియాలోని తన ఇంటికి రాగా..గణేశ్‌ ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో బబిత చేసేదేమి లేక ప్రస్తుతం జిల్లా ఆస్పత్రి షెల్టర్ లో తలదాచుకుంది. దీనిపై గ్రామ‌స్థులు భ‌ర్త చేసిన ప‌నికి సీరియ‌స్ అవుతున్నారు. క‌రోనాపై అనుమానం ఉంటే ద‌గ్గ‌రుండి భ‌ర్త‌నే ప‌రీక్ష‌లు చేయించాల్సింది పోయి.. ఇలా క‌ఠినంగా వ్య‌వ‌హారిస్తాడా అని మండిప‌డుతున్నారు. ఇదిలాఉంటే కుటుంబానికి సంబంధించిందని, ఈ ఘటనపై సదరు భార్యాభర్తలతో మాట్లాడటం జరుగుతుందని సిటీ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జి విపిన్‌ సింగ్‌ చెప్పారు.