ఘనంగా పెళ్లి రిసప్షన్.. ఆ తరువాత పెళ్లికూతురు ఏమైందంటే....

ఘనంగా పెళ్లి రిసప్షన్.. ఆ తరువాత పెళ్లికూతురు ఏమైందంటే....

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన  ఆ పెళ్లి కూతురుకి.. నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు..తీరని దుఃఖం మిగిలింది.

వరుడితో కలిసి  వెళ్లిన నవ వధువు.. ఊహించని విధంగా  చనిపోయింది. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా తమతో గడిన ఆమె.. చనిపోవడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. రిసప్షన్ అయిన తరువాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో అస్వస్థతకు గురై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.   జౌన్ పూర్ నివాసి రోష్ని(21), ముఖ్తార్ అహ్మద్ (22) లకు జూన్ 17న వివాహం జరిగింది.  అయితే జూన్ 19( ఆదివారం) పెద్ద ఎత్తున వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.  అప్పటివరకు ఎంతో చలాకీగా ఉన్న రోష్ని ఒక్కసారిగా అన్ ఈజీగా ఫీలయింది. కడుపునొప్పి, వాంతులు, లూజ్ మోషన్స్ కావడంతో నీరసపడింది.  దీంతో వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.  రోష్ని చికిత్స పొందుతూ సోమవారం ( జూన్ 19) మృతి చెందిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అనిల్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన  గోపిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  రోష్ని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.