బ్రిడ్జిపైనుంచి సముద్రంలో దూకిన మహిళ

బ్రిడ్జిపైనుంచి సముద్రంలో దూకిన మహిళ

ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతుపై తొలి ఆత్మహత్యాయత్నం కేసు నమోదు అయింది. 43 యేళ్ల మహిళ.. కొత్త బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకింది. ఇంకా ఆమె ఆచూకీ తెలియనప్పటికీ..ఆమె ఇంటినుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. 

మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 43 యేళ్ల మహిళా డాక్టర్ కింజాల్ కాంతాలాల్ షా దాదాసాహెబ్ ఫాల్కే రోడ్డులోని నవీన్ ఆశా భవనంలో షా తండ్రితో కాలసి ఉంటోంది.  కొన్నేళ్లేగా డిప్రెషన్ తో బాధపడుతూ చికిత్స పొందుతోంది.  సోమవారం(మార్చి 18) ముంబైలోని అటల్ సేతు వంతెన రహదారిపై నుంచి అరేబియా సముద్రంలోకి దూకింది. 

 ఎంత వెతికినా ఆమె మృతదేహం లభించలేదు. అయితే ఆమె ఇంటినుంచి సూసైడ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు..ఆమె తీవ్రమైన డిప్రెషన్ తో బాధపడుతోందని.. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసి వుండొచ్చని భావిస్తున్నారు. సూసైడ్ నోట్ లో తన మరణానికి ఎవరూ కారణం కాదని.. ఆమెను అక్కడికి తీసుకెళ్లిన టాక్సీ డ్రైవర్ కూడా కాదని నోట్ లో పేర్కొంది. 

మార్చి 18న మధ్యాహ్నం తన నివాసం నుంచి టాక్సీ మాట్లాడుకొని అటల్ సేతు వంతెన వద్దకు తీసుకెళ్లమని డ్రైవర్ కోరింది. ముంబై నుంచి దాదాపు 14.3 కిలోమీటర్ల దూరంలో ఆపమని కోరింది. డ్రైవర్ ఒప్పుకోలేదు..అయినా ఆమె పట్టబట్టడంతో డ్రైవర్ ఆటోను ఆపాడు. ఆ తర్వాత వంతెన పై నుంచి సముద్రంలోకి దూకిందని పోలీసులు చెబుతున్నారు.   

వెంటనే టాక్సీ డ్రైవర్ నవీ ముంబై పోలీసులకు విషయం తెలిపాడు. పోలీసులు, స్థానికులు, గజఈతగాళ్లలో  ఆమె మృత దేహం కోసం వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
మరోవైపు సోమవారం పనిమీద ఇంటినుంచి బయటికి వెళ్లిన ఆమె తండ్రి ఇంటికి రాగానే సూసైట్ కనిపించింది. దీంతో షా తండ్రి బోయివాడ పోలీస్ స్టేషన్ లో తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.. ప్రస్తుతం ఇంకా ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.