రన్నింగ్ బస్సులో మహిళ ప్రసవం

రన్నింగ్ బస్సులో మహిళ ప్రసవం

కేరళ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులో 37ఏళ్ల మహిళ ప్రసవించింది. మే 29 (బుధవారం) ఆమె త్రిసూర్ నుంచి కోజికోడ్ వెళ్తోంది. బస్సులో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో బస్ లోని మహిళలు, ఆర్టీసీ సిబ్బందితో కలిసి సహాయం చేసి నార్మల్ డెలివరీ చేశారు. ఆమెకు పాప పుట్టింది. 

పురిటినొప్పులతో ఆమె పడే భాద చూడలేక రన్నింగ్ బస్ లోనే ప్రసవం చేశారు. తర్వాత త్రిసూర్ లోని ఓ హాస్పిటల్ లో ఇర్దర్ని చేర్పించారు. తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. అందరూ ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ, ప్రసవానికి సహయం చేసిన వారిని అభినందిస్తున్నారు.