
సీతాపూర్: ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో ఒక మహిళ అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉండటం చూసి వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ అరుదైన బిడ్డను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. దురదృష్టవశాత్తూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఆ బిడ్డ చనిపోయింది. ఆ పసికందు దేహం, మరో దేహంతో కలిసి ఉంది.
Also Read:-హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్స్..
సీతాపూర్ పరిధిలోని కిరాట్పూర్ తాలూకాలో ఉన్న కోరియన్ పూర్వా అనే గ్రామానికి చెందిన రమాదేవి అనే 40 ఏళ్ల మహిళకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో స్థానిక పీహెచ్సీకి తరలించారు. తెల్లవారుజామున 5 గంటలకు రమాదేవి ఈ అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది. రమాదేవికి పుట్టిన బిడ్డ రెండు ముఖాలతో ఉన్న విషయం గ్రామస్తులకు తెలియడంతో పీహెచ్సీకి తండోపతండాలుగా తరలివచ్చి బిడ్డను చూసేందుకు ఆసక్తి చూపారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఇలా రెండు శరీరాలతో బిడ్డ పుట్టడంపై వైద్యులు మాట్లాడుతూ.. ఒక శరీరం మాత్రమే పూర్తిగా రూపాంతరం చెందిందని.. మరో శరీరం ఎదగలేదని చెప్పారు.
सीतापुर - रेवान सांडा पीएचसी में अद्भुत बालक का जन्म
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) July 22, 2024
➡बालक के चार पैर, चार हाथ बना चर्चा का विषय
➡बालक का समूर्ण दूसरा शरीर एक में ही जुड़ा हुआ
➡बच्चे को देखने के लिए उमड़ रही सैकड़ों की भीड़#Sitapur | #BreakingNews | #BharatSamachar pic.twitter.com/dvnjc6G8Ch
ఇదిలా ఉండగా.. బిడ్డ అలా పుట్టేసరికి ఆసుపత్రి సిబ్బంది భయంతో బెంబేలెత్తిపోయారు. హాస్పిటల్లో ఉంచొద్దని, ఇంటికి తీసుకెళ్లిపోవాలని గొడవ చేశారు.పాపం.. పుట్టిన ఐదు గంటలకే బిడ్డ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ బిడ్డకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డ చనిపోవడంతో రమాదేవి కుటుంబం నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇలా అరుదైన లక్షణాలతో పుట్టే బిడ్డలు ఎక్కువ రోజులు బతికిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. అయితే.. పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి.