హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్స్.. 

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం... మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్స్.. 

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కాలేజీలు,పబ్స్ అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ యథేచ్ఛగా వాడేస్తున్నారు యూత్.తాజాగా సిటీలోని పలు కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నారు అధికారులు.  ఉస్మానియా మెడికల్ కాలేజ్, సిబిఐటి, గురు నానక్ ఇంజనీరింగ్ కాలేజ్, త్రిబుల్ ఐటీ బాసర లాంటి సంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడినట్లు గుర్తించారు.ఉస్మానియా హాస్పిటల్ లో ఆరుగురు జూనియర్ డాక్టర్లు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు పోలీసులు. 

Also Read:-రెండు ముఖాలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పుట్టిన బిడ్డ..! వీడియో ఇదే..

గత కొన్ని నెలలుగా డ్రగ్స్ అరికట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు టెక్నికల్ సహకారంతో డ్రగ్స్ ముఠాల ను వెంటాడుతున్నామని తెలిపారు అధికారులు. వరుస దాడులతో డ్రగ్ పెడ్లర్స్ లో భయం సృష్టించామని అన్నారు. డ్రగ్స్ కి హాట్స్పాట్ గా మారిన పబ్బులపై నిరంతర తనిఖీ నిర్వహించామని తెలిపారు.నోవటల్ లోని ఆర్టిస్ట్రీ పబ్బుల్లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను   అదుపులోకి తీసుకున్నామని అన్నారు.కెవ్ పబ్బులో నిర్వహించిన పార్టీలో 52 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తే 33 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.సెలబ్రిటీలు చిరంజీవి, సుమన్, పీవీ సింధు లాంటి వారితో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీలు ఆవరణలో స్నిఫర్ డాగ్స్ తో తనిఖీ చేస్తున్నామని, స్కూల్ ఆవరణలో గంజాయి తో పట్టుబడితే జువైనల్ ఆక్ట్ పెడుతున్నట్లు తెలిపారు. సింబయోసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుపడ్డారని, వీరితోపాటు వీరి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామని అన్నారు. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో 15 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టబడ్డారని అన్నారు. సిబిఐటి కాలేజీలో మరో విద్యార్థి కి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

త్రిబుల్ ఐటీ బాసరలో కూడా పలువురు విద్యార్థులు డ్రగ్స్ బారిన పడినట్లు గుర్తించారు. త్రిబుల్ ఐటీ బాసర కు నాందేడ్ నుండి గంజాయి వస్తున్నట్లు గుర్తించామని అన్నారు. ఇండస్ స్కూల్ తోపాటు సిబిఐటీ చెందిన పలువురు విద్యార్థులు ఈ సిగిరేట్స్ కు అలవాటు పడ్డారని తెలిపారు. పలు పబ్బులలో మైనర్లకు మద్యం సరఫరా చేయకుండా కఠిన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు అధికారులు.