
శ్రద్ధావాకర్ హత్యను నిరసిస్తూ హిందూ ఏక్తా మంచ్ మహాపంచాయత్ కి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఛతర్ పూర్ లో నిర్వహించిన సభలో వేదికపై ఉన్న వ్యక్తిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది. సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన మహిళ పట్ల సభపై ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మహిళ చెప్పులతో వ్యక్తిపై దాడి చేయడంతో కార్యక్రమంలో ఉన్నవారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
గందరగోళం మధ్య కొంతమంది ఆ వ్యక్తిని రక్షించడానికి సభపైకి వెళ్లారు. మహిళలంతా ఆ వ్యక్తిపై మూకుమ్మడి దాడి చేశారు. భేటీ బచావో మహాపంచాయత్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.