హైదరాబాద్ హోటల్ లో హల్వా తిని ఆస్పత్రిలో చేరిన మహిళ

హైదరాబాద్ హోటల్ లో హల్వా తిని ఆస్పత్రిలో చేరిన మహిళ

హైదరాబాద్:  గ్రేటర్ సిటీలో చాలా హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్, కుళ్లిన, చెడిపోయిన ఫుడ్ కస్టమర్లకు ఇస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోజుకో చోట ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తుండడంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఫుడ్ సేప్టీ ఆఫీసర్ల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నాసిరకం ఫుడ్, కల్తీ ఆయిల్ తో తయారు చేస్తున్న పుడ్ , అపరిశుభ్ర కిచెన్ లు చూసి అధికారులే విస్తుపోతున్నారు

తాజాగా హైదరాబాద్ లక్డీకాపూల్ ద్వారకా హోటల్ లో చెడిపోయిన క్యారెట్  హల్వా సర్వ్ చేశారు. అది తినిన ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు. అతిసారం, కడుపునొప్పితో బాధపడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు ద్వారకా హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.