వివాహేతర సంబంధం : కన్నకొడుకునే చంపిన తల్లి

వివాహేతర సంబంధం : కన్నకొడుకునే చంపిన తల్లి

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చింది ఓ తల్లి. ఏడు సంవత్సరాల కొడుకు(అంజాద్) ను  అతి దారుణంగా గొంతు నలిమి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ దారుణ ఘటనతో కాలనీ వాసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కసాయి తల్లి చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హత్య గురించి తెలుసుకున్న మైలార్ దేవిపల్లి పోలీసులు  ఘటనాస్థలికి చేరుకొని, కేసు నమోదు చేసుకొన్నారు.   ఆమెను అదుపులోకి తీసుకొని దర్యాప్తు  ప్రారంభించారు.

Woman killed her son for her illegal affair