
హైదరాబాద్: గాంధీనగర్ పరిధిలోని కవాడిగూడ మూసీ నాలాలో లక్ష్మీ అనే మహిళ గల్లంతయ్యింది. లక్ష్మీ ఆచూకీకోసం డీఆర్ ఎప్ బృందాలను రంగంలోకి దించారు అధికారులు.. మూడు బృందాలుగా 100 మంది సిబ్బంది నాలాలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఆర్ ఎఫ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. బృందాలుగా విడిపోయి మహిళకోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
నిన్న (2023 సెప్టెంబర్ 3న) సంజీవయ్య నగర్ లో ఉంటే లక్ష్మీ (55) నాలా పక్కన ఇల్లు నిర్మించుకోగా.. ఇటీవల వర్షాలకు కూలిపోయింది. అయితే సోమవారం ఉదయం లక్ష్మీ కనిపించకుండా పోయింది. ఆమె నాలాలలో పడిపోయినట్లు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి లక్ష్మీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
సోమవారం (2023 సెప్టెంబర్ 3న) ఉదయం ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లోకి వెళ్లిన లక్మ్షి ఆ తర్వాత కనిపించకండా పోయింది. నాలా దగ్గర లక్ష్మి చేతి గాజులను కుటంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.