
కరీంనగర్ జిల్లా: దళిత మహిళని కావడం వల్లనే తనను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు తాళ్ల విజయలక్ష్మీ అనే మహిళ. జిల్లాలోని గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ తనను పదవి నుండి అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. తమ గ్రామంలో వైకుంఠ ధామ నిర్మాణాన్ని గ్రామస్థులు వ్యతిరేకించడం వల్ల నిర్మాణం చేయలేకపోయామని, దీన్ని కారణంగా చూపి కలెక్టర్ తనను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. భూమి కొనుగోలు చేసి వైకుంఠధామం నిర్మించాలని చూస్తే గ్రామంలోని పెద్దమనుషులు అడ్డుకున్నారని, ఈ విషయంలో తన తప్పు లేకున్నా శిక్ష విధించారని వాపోయారు. తన సస్పెన్షన్ కు స్థానిక ఎమ్మెల్యేనే కారణమని, సస్పెన్షన్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.