V6 News

నేను టీ అమ్ముతాను.. ఓటును అమ్ముకోను: ఆలోచింపజేస్తోన్నమహిళ వినూత్న ఐడియా

నేను టీ అమ్ముతాను.. ఓటును అమ్ముకోను: ఆలోచింపజేస్తోన్నమహిళ వినూత్న ఐడియా

ములుగు, వెలుగు : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా గ్రామంలో ఓ టీస్టాల్‌‌‌‌ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బోర్డు పలువురుని ఆలోచింపజేస్తోంది. పస్రాకు చెందిన పద్మజ స్థానికంగా టీ స్టాల్‌‌‌‌ నిర్వహిస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో.. ‘నేను టీ అమ్ముతాను.. కానీ ఓటును అమ్ముకోను’ అని రాసి ఉన్న బోర్డును టీ స్టాల్‌‌‌‌ ఎదుట అతికించింది. ప్రతి ఒక్కరూ ఓటు ప్రాముఖ్యతను తెలుసుకోవాలనే బోర్డును ఏర్పాటు చేసినట్లు పద్మజ చెప్పారు.