75 ఏండ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి

75 ఏండ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి

న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన 92 ఏండ్ల పెద్దావిడ 75 ఏండ్ల తర్వాత పాకిస్తాన్​లోని తన పూర్వీకుల ఇంటిని సందర్శించింది. 3 నెలల గడువుతో వీసా మంజూరు చేయడంతో రీనా చిబ్బర్ శనివారం పాక్​లోని రావల్పిండిలో ఉన్న ప్రేమ్​నివాస్​కు చేరుకున్నారని అక్కడి మీడియా వెల్లడించింది. తనలాంటివాళ్లు వచ్చిపోవడానికి వీలుగా వీసా నిబంధనలు సడలించాలని, అందుకు 2 దేశాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా రీనా ఇండియా, పాక్ ప్రభుత్వాలను కోరారు. 1947లో దేశ విభజనప్పుడు తన వయసు 15 ఏండ్లని, అప్పుడు తన కుంటుంబం ఇండియాకు వచ్చేసిందని చెప్పారు. తాను 1965లో తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు వీసా అప్లై చేసినప్పటికీ, యుద్ధం కారణంగా పాక్ అనుమతివ్వలేదని ఆమె పేర్కొన్నారు.