బిడ్డ కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం

బిడ్డ కోసం చిరుతతో తల్లి వీరోచిత పోరాటం
  • మహారాష్ట్రలో ఓ తల్లి సాహసం 

చంద్రాపూర్: కన్న కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. చేతిలో చిన్న కట్టె మాత్రమే ఉన్నా.. తెగించి పోరాడి పులిని అడవిలోకి తరిమికొట్టింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్​జిల్లాకు15 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్​ఏరియాకు సమీపంలో జునోనా అనే పల్లె ఉంది. గ్రామానికి చెందిన అర్చన మేశ్రం తన ఐదేళ్ల బిడ్డతో జూన్​30న ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. అడవి నుంచి వచ్చిన చిరుత వారిపై దాడి చేసింది. పాపను నోట కరుచుకునేందుకు ప్రయత్నించగా.. తన బిడ్డను కాపాడుకునేందుకు అర్చన పక్కనే దొరికిన కట్టె తీసుకొని చిరుతతో చాలా సేపు పోరాడింది. చివరకు చిరుత పాపను వదిలి అడవిలోకి పారిపోయింది. దాడిలో తీవ్రంగా గాయపడిన పాపను జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి, అక్కడి నుంచి నాగ​పూర్​లోని గవర్నమెంట్​ డెంటల్​ హాస్పిటల్​కు తరలించారు. పాప ట్రీట్​మెంట్​ కోసం కొంత పరిహారం అందజేసినట్లు ఫారెస్ట్​ కార్పొరేషన్​ డివిజనల్​ మేనేజర్​ వీఎం రాయ్ తెలిపారు.  నాగపూర్​లోని ఓ హాస్పిటల్​లో సోమవారం పాపకు సర్జరీ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.