బట్టలు ఉతికి.. ఐరన్ చేస్తూ.. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇలాంటివి చూసినప్పుడే బతుకుపై..

 బట్టలు ఉతికి.. ఐరన్ చేస్తూ.. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఇలాంటివి చూసినప్పుడే బతుకుపై..

మన ఇంటికి వస్తాడు.. మాసిన మన బట్టలు తీసుకెళతాడు.. శుభ్రంగా ఉతుకుతాడు.. ఆ తర్వాత ఐరన్ చేస్తాడు.. తిరిగి ఇంటికి తీసుకొస్తాడు.. చేసే పని చీప్ గా కనిపించొచ్చు.. మనకు పనోడుగా ఉండొచ్చు.. ఇవన్నీ కళ్లకు కనిపించేవి.. మన భావాలు.. అతని సంపాదన ఎంతో తెలుసా.. అక్షరాల 3 లక్షల రూపాయలు.. అవును.. ఇది ఏడాదికి కాదు.. నెలకు అతని సంపాదన 3 లక్షల రూపాయలు.. షాపు అద్దె.. కుర్రోళ్ల జీతాలు అన్ని పోగా మిగిలేది 2 లక్షల రూపాయలపై మాటే అంట.. ఎక్కడ.. ఏంటీ.. ఎలా అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఓ మహిళ ఆమె ఇంటి పక్కన ఉండే ఒక చిన్న డ్రై క్లీనింగ్ షాపు యజమాని నెలకు రూ. 2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడని పోస్ట్ చేసింది.  అందులో ఆ షాపులో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పనివాళ్ళు కూడా ఉన్నారని..  వారి వ్యాపారం లెక్కలు అంచనా వేస్తూ వివరాలు చెప్పుకొచ్చింది.  వాళ్ళు  రోజుకు 350 బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఒక్కో జతకు(shirt&pant) రూ. 20 చొప్పున వేసుకున్న రోజుకు రూ. 3,500 వస్తుంది. ఇక  సూట్లు, చీరల వంటి ఖరీదైన దుస్తుల డ్రై క్లీనింగ్ ద్వారా రోజుకు మరో రూ. 7,000 వస్తుంది. ఇలా నెలకి 27 రోజులు పని చేస్తే నెల ఆదాయం మొత్తం రూ. 2.83 లక్షలు అవుతుందని చెప్పింది.

ఇందుకు ఖర్చులు చూస్తే కరెంటు బిల్లు ఒక రూ. 6,000,  పనివాళ్ళ జీతాలు ఒక రూ. 40 వేలు పోను, మొత్తం లాభం రూ. 2 లక్షల 37 వేలు మిగులుతుంది. పైగా ఆ షాపు వాళ్ళ సొంతం అంటే అద్దె ఖర్చు కూడా లేదు.

సోషల్ మీడియా స్పందన
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిగ్రీల కంటే కష్టపడే స్వభావం, తెలివైన ఆలోచన ఉంటే చిన్న వ్యాపారాల్లో కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదించవచ్చు అని కొందరు అంటుండగా...  లక్షల్లో సంపాదించే ఇలాంటి వ్యాపారస్తులు పన్నులు కట్టరు, కానీ తక్కువ జీతం వచ్చే ఉద్యోగులు మాత్రం కచ్చితంగా పన్నులు కట్టాల్సి వస్తోంది అని మరికొందరు... 

ఇంకొందరైతే మాత్రం ఈ లెక్కలు పైకి కనిపించినంత ఈజీ  కావని.. మెట్రో నగరాల్లో, ఎక్కువ జనాభా ఉన్న చోట మాత్రమే ఇలాంటి ఆదాయం సాధ్యమని చెబుతున్నారు. ఈ వైరల్ పోస్ట్‌ను కొందరు కొట్టిపారేస్తుండగా... ఎందుకంటే డ్రై క్లీనింగ్ వ్యాపారంలో పైన చెప్పిన ఖర్చులే కాకుండా కెమికల్స్, మెషీన్ల రిపేర్లు, వాటర్ వంటి ఖర్చులు చాలా ఉంటాయని చెబుతున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 60,000 వరకు మాత్రమే లాభం రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.