
జోగులాంబ గద్వాల జిల్లా: దేవుడు కలలోకి వచ్చి కడుపులోని శిశువును మాయం చేశాడంటూ ఓ మహిళ వింతగా మాట్లాడటంతో స్థాదనికంగా కలకలం రేపింది. ఈ సంఘటన ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ తాను నిండు గర్భిణినని.. అయితే శనివారం రాత్రి దేవుడు కలలోకి వచ్చి మాట్లాడినట్లు చెప్పింది. ఆదివారం ఉదయం లేచేసరికి ఎలాంటి గర్భం లేదని, దీంతో హాస్పిటల్ కి వచ్చానని తెలిపింది. పరీక్షించిన డాక్టర్లు నెల క్రితమే ఆ మహిళకు అబార్షన్ అయినట్లు నిర్ధారించారు.
ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ.. ఆ మహిళ చెప్పేది అవాస్తవమని అన్నారు. ఆమెకు మతిస్థిమితం తప్పినట్లుందని మహబూబ్ నగర్ కు తీసుకెళ్లి డాక్టర్ల పర్యవేక్షణలో సైకలాజికల్ ట్రిట్ మెంట్ ఇప్పించాలని తెలిపారు. అవసరమైతే స్కానింగ్ తీయించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్ పర్సన్ సరిత డారుక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. మంజులకు మెరుగైన ట్రీట్ మెంట్ అందించాలని కోరారు. తర్వాత మంజుల తల్లిగారి ఊరైన పెద్దపోతులపాడుకు వెళ్లి ఆమెను పరామర్శించారు జెడ్పీ చైర్ పర్సన్ సరిత.