
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పార్క్ లో వాకింగ్ చేస్తుంటే మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా సెల్ ఫోన్ లాక్కెళ్లి మూసిలో పడేశారు. శుక్రవారం(ఆగస్టు 29) ఉప్పల్ భగాయత్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వివరాల్లో్కి వెళితే..
శుక్రవారం ఉదయం 8.30గంటల టైంలో ఉప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని ఓ పార్కులో ప్రవీణ(42) తన భర్తతో కలిసి వాకింగ్ చేస్తుండగా వెనకనుంచి వచ్చిన గుర్తుతెలియన వ్యక్తులు ఆమెను బెదిరించారు. భార్యభర్తలను కొట్టి మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు, చెవి కమ్మలు లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు. అంతేకాదు ప్రవీణ దగ్గర ఉన్న ఆపిల్ సెల్ఫోన్ లాక్కొని మూసిలో వేసినట్లు తెలుస్తుంది.
షాక్ నుంచి తేరుకున్న ప్రవీణ, ఆమె భర్త వెంటనే 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు రాచకొండ పోలీసులు.
►ALSO READ | హాస్టల్ వాచ్ మెన్ ను కొట్టి .. రూంలో బంధించి... పరారైన నలుగురు బాలికలు..