
హైదరాబాద్ పంజాగుట్టలో దారుణం జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. వెంటనే అక్కడున్న పోలీసులు మంటలను ఆర్పేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలు చెన్నైకి చెందిన లోకేశ్వరిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.