చీరకట్టులో మహిళ జిమ్.. నెటిజెన్స్ కామెంట్స్

చీరకట్టులో మహిళ జిమ్.. నెటిజెన్స్ కామెంట్స్

ఓ మహిళ చీరకట్టులో జిమ్‭లో వ్యాయామం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీనా సింగ్ అనే మహిళ చీరకట్టులోనే పలు రకాల వ్యాయామాలు చేసింది. లారీ టైర్‭ను ఎత్తి ఆమె వ్యాయామాలు చేసింది. అంతేకాకుండా జంపింగ్, లిఫ్టింగ్, లాట్ ఫుల్ డైన్స్ వంటి అన్ని రకాల వ్యాయామాలను సునాయాసంగా చేస్తోంది. ఇది ప్రారంభం మాత్రమేనంటూ ఈ వీడియోను తన ఇన్‭స్టాగ్రామ్‭లో ఫోస్టు చేసింది. 

సాధారంగా మహిళలు చీరకట్టుకుని జిమ్‭లో వ్యాయామం చేయడం కష్టమైన పని.. కాని రీనా సింగ్ అన్ని రకాల వ్యాయామాలను చీరకట్టులో సునాయాసంగా చేసి అందిరినీ అబ్బురపరుస్తోంది. రీనా సింగ్ సాధించిన ఫిట్ నెస్‭ను ప్రశంసిస్తూ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వీడియో 3.5 కోట్ల మందికి పైగా చూశారు. అంతకుముందు కూడా తన ఫిట్ నెస్‭కు సంబంధించిన వీడియోలను ఆమె తన ఇన్‭స్ట్రాగ్రామ్‭లో పోస్టు చేసింది.