V6 News

Chinmayi: మహిళలారా మేల్కొనండి: సైకోల పట్ల జాగ్రత్త..- చిన్మయి భావోద్వేగ వీడియో వైరల్!

Chinmayi: మహిళలారా మేల్కొనండి: సైకోల పట్ల జాగ్రత్త..- చిన్మయి భావోద్వేగ వీడియో వైరల్!

సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళల సమస్యలపై తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తుంటారు. అందుకే ఫెమినిస్ట్ అంటూ ఆమెను ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. అయితే ట్రోలింగ్ ని కూడా ఎదుర్కోడానికి రెడీగా ఉండే చిన్మయి.. లేటెస్టుగా సైబర్ బెదిరింపులకు గురయ్యారు. మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని పంపి బెదించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది.

 గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న నిరంతర వేధింపుల గురించి ప్రస్తావిస్తూ చిన్మయి .. ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన మార్ఫింగ్ ఫొటోలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తన మార్ఫింగ్ ఫొటోను, దాన్ని షేర్ చేసిన ట్విట్టర్ అకౌంట్ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసింది. ఈరోజు నాకు ఒక పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన ఫొటో వచ్చింది. నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది ఇక్కడ విషయం కాదు. కానీ గత 8,10 వారాలుగా మా కుటుం బాన్ని వేధించడానికి డబ్బు చెల్లించి ఇలా చేస్తున్నరని చెప్పింది. ఇలాంటి వ్యక్తులు వారి భార్య, చెల్లెళ్లను ఎక్కువగా వే ధిస్తారని పేర్కొంది.. 

ఇక ప్రగతి ఫొటోలకు అస భ్యకరమైన కామెంట్లు చేసినవారు వారి జీవితంలో ఏం సాధించారు? అమ్మాయిలు.. మీరు ప్రగతిలా స్ఫూర్తి పొందండి. మీపై వచ్చే చెడు కామెంట్లను పక్కన పెట్టండి. సైకోల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలి' అంటూ వీడియో రిలీజ్ చేసింది.  దీప్‌ఫేక్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదలతో, తమతో విభేదించే ,  ప్రతీకారం తీర్చుకోవాలనుకునే పురుషుల నుండి మరింత మంది మహిళలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని చిన్మయి హెచ్చరించారు. 

"నేను ఇలాంటి వాటికి సిగ్గుపడే రకం కాదు" అని ధైర్యంగా నిలబడ్డారు చిన్మయి. అంతేకాకుండా, మహిళలు, బాలికలు ,తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడకూడదని విజ్ఞప్తి చేశారు. చిన్మయి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.