గుజరాత్ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ.. సంబరాల్లో కార్యకర్తలు

గుజరాత్ ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ.. సంబరాల్లో కార్యకర్తలు

గుజరాత్‌లో బీజేపీ మరోసారి ఘనవిజయం దిశగా దూసుకెళ్తోంది. కౌంటింగ్ మొదలైన ముందు నుంచే ఆధిక్యంలో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ... ఇప్పటి వరకు 150కి పైగా స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దీంతో గాంధీనగర్‌లోని మహిళా బీజేపీ కార్యకర్తలు డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గుజరాత్ లో ఈ సారి కూడా కాషాయ జెండానే రెపరెపలాడనుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

ఈసీ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లో182 స్థానాలకు పోటీ జరుగుతుండగా152 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 20కి పైగా స్థానాల్లో ముందంజలో ఉండగా, ఆప్ 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.