టీఆర్ఎస్ తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవియ్యలె

టీఆర్ఎస్ తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవియ్యలె

హైదరాబాద్: పరిపాలనలో మహిళలకు సాటి లేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ రంగాలకు చెందని పలువురు మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పరిపాలనలో మహిళలకు సాటి లేరని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కూడా మహిళల పాత్ర చాలా ఉందన్నారు. సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్, మీరా కుమార్  తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రతి రంగంలో మహిళలు దూసుకుపోతున్నారన్నారు. క్రీడా రంగంలో ప్రపంచ వేదికల్లో దేశ ప్రతిష్టను నిలబెడుతోంది సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు, మిథాలిరాజ్ వంటి మహిళలేనన్నారు. 

స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. ఎనిమిదేళ్లు మహిళా రిజర్వేషన్ బిల్లును పీఎం మోడీ పక్కనపెట్టారన్నారు. టీఆర్ఎస్ తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి కేటాయించకుండా కేసీఆర్ మహిళలను అవమానించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

మరిన్ని వార్తల కోసం:

రష్యాలో కార్యకలాపాలు నిలిపేసిన ఐబీఎం

ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్