యూపీలో బావిలో పడి 13 మంది మృతి

యూపీలో బావిలో పడి 13 మంది  మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడి 13 మంది మహిళలు చనిపోయారు. ఖుషీ నగర్ లోని ఓ ఇంట్లో జరిగిన వివాహ కార్యక్రమంలో భాగంగా హల్దీ వేడుకలు జరిగాయి. హల్దీ వేడుకలకు భారీగా అతిథులు తరలివచ్చారు. బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో 50 నుంచి 60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు. మూసేసిన పాడుబడ్డ బావిపై ఇనుపకంచె ఏర్పాటుచేశారు. ఆ కంచెపై కొందరు మహిళలు నిల్చున్నారు. సడెన్ గా ఆ మెష్ విరిగిపోయి... కొందరు మహిళలు, బాలికలు బావిలో పడ్డారు. స్పాట్ లోనే 11 మంది చనిపోయగా...మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా మారింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. ఆ ఇద్దరు కూడా మృతి చెందారు. ఓవర్ లోడ్ కారణంగానే.. మెష్ కూలిపోయినట్లు భావిస్తున్నారు పోలీసులు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం తెలిపారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. హాస్పిటల్ లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఘటన పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు సత్వర సాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం

యూపీలో ఓబీసీలు, దళితులు బీజేపీ వైపే

రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?