
మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శామీర్ పేట పోలీసుల వివరాల ప్రకారం.. సిధ్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ(28) కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ మేరకు భర్త స్వామి ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
ఈ రోజు (ఆగస్టు 17) రాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట చెరువు నీటిలో భానుప్రియ(28), కూతురు దీక్ష(4) మృతదేహాలు లభ్యం అయ్యాయి. వీళ్లను ములుగుకు చెందిన భానుప్రియ ఆమె పిల్లలేనని పోలీసులు గుర్తించారు. వేదాన్ష్ ఆనంద్(5) మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో అక్కడి నుంచి వచ్చి శామీర్ పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.