కరోనాతో జాబ్​ పోయినోళ్లలో మహిళలే ఎక్కువ

కరోనాతో జాబ్​ పోయినోళ్లలో మహిళలే ఎక్కువ

హైదరాబాద్​, వెలుగు: కోవిడ్​ కారణంగా 47 శాతం మహిళలు తమ ఉద్యోగాలు కోల్పోయారని, పురుషులు 7శాతం మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.  కంపెనీలు తిరిగి మహిళలకు జాబ్స్​ ఇవ్వాలని  సూచించారు.  హైటెక్స్, కాన్ఫెడరేషన్​ ఆఫ్​ ఉమెన్​ ఎంటర్​ప్రైజెస్​ ఇండియా సంయుక్తంగా మహిళా వ్యాపారులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న  బిజినెస్​ ఉమెన్​ ఎక్స్​పో 2022 రెండవ ఎడిషన్​ శుక్రవారం మాదాపూర్​ హైటెక్స్​లో ప్రారంభమైంది. ఈ ఎక్స్​పోను ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..  దేశంలో 21 శాతం మంది మహిళలే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ప్రపంచ సగటు 47% మహిళా ఉద్యోగులు ఉంటే యూఎస్​ఏ  లో 86% మహిళా ఉద్యోగులు ఉన్నారని, మనదేశంలోనూ మహిళల వాటా  86%కి చేరుకుంటే, దేశ  జీడీపీకి లాభమని అన్నారు.