
హైదరాబాద్, వెలుగు: అమెరికా వెళ్లాల్సిన వివాహిత అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు దోమలగూడకు చెందిన అమృత(29), భర్త ప్రకాష్ తో కలిసి 6 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. గత నవంబర్ లో ఇద్దరూ హైదరాబాద్ వచ్చారు. జనవరి 1న ప్రకాష్ సెలవులు ముగించుకొని అమెరికా వెళ్లిపోయాడు. ఫిబ్రవరి 25న అమృత అమెరికాకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరి 22వ తేదీన దోమలగూడలో ఉంటున్న అమృత తల్లి గంగ కలిసి వెళ్లింది.
నల్లకుంటలో ఉండే గంగకు 23వ తేదీ మధ్యాహ్నం 2గంటల సమయంలో అమృత అత్త ఫోన్ చేసి అమృత ఉందా అని అడిగింది. తమ వద్ద లేదని గంగ చెప్పింది. దీంతో అమృత తల్లి తెలిసిన వారిని, బంధువుల దగ్గర ఆరా తీసింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శనివారం రాత్రి చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.