కాగజ్ నగర్ లో 30 గంటలు బతుకమ్మ ఆడిన్రు

కాగజ్ నగర్ లో 30 గంటలు బతుకమ్మ ఆడిన్రు
  • కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణం నౌగాం బస్తీలో ఇరువర్గాల మహిళల పోటాపోటీ
  • పెద్దల జోక్యంతో మంగళవారం అర్ధరాత్రి ఆట ముగింపు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ పట్టణంలోని నౌగాంబస్తీకి చెందిన రెండు వర్గాల మహిళలు 30 గంటల పాటు ఏకధాటిగా బతుకమ్మ ఆడారు. వివరాల్లోకి వెళ్తే... నౌగంబస్తీకి చెందిన ఇరువర్గాల మహిళలు సోమవారం సాయంత్రం వేర్వేరుగా బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారు. ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొనడంతో మీరే ముందు బతుకమ్మను ఎత్తాలంటే... మీరే ముందు ఎత్తాలంటూ పోటాపోటీగా పాటలు పాడుతూ ఆటలు ఆడారు. 

సోమవారం సాయంత్రం మొదలుపెట్టిన బతుకమ్మ ఆట మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలనీకి వచ్చి.. ‘బతుకమ్మ ఆట ఎంత సేపేనా ఆడుకోండి, కానీ గొడవలు పెట్టుకోవద్దు’ అని సూచించి వెళ్లిపోయారు. చివరకు మంగళవారం అర్ధరాత్రి కాలనీపెద్దలు ఇరువర్గాలను సముదాయించి రెండు బతుకమ్మలను ఒకే సమయంలో ఎత్తాలని నిర్ణయించడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు బతుకమ్మలను ఎత్తి ఆట ముగించారు.