కుళాయిల్లో మురుగునీరు వస్తోందని నిరసన

కుళాయిల్లో మురుగునీరు వస్తోందని నిరసన

హైదరాబాద్ వాటర్ బోర్డు దగ్గర వామపక్షాల ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తున్నాయంటూ ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్, బాగ్ లింగంపల్లి, దోమలగూడ తదితర ప్రాంతాల్లో తాగునీటి కుళాయిల్లో  కలుషిత నీళ్లు వస్తున్నాయని మహిళలు, బస్తీ ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి పైగా అయింది. కుళాయిల్లో తాగునీళ్లు సరిగా వస్తలేవని.. మురుగు నీళ్లు, కలుషిత నీల్లు వస్తున్నాయని చెబితే.. అధికారులు, సిబ్బంది వస్తున్నారు.. చూసి పోతున్నారే తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక భరించే ఓపిక లేకనే వాటర్ బోర్డు ఎదుట ధర్నాకు వచ్చామన్నారు. అభివృద్ధిలో ముందున్నామని చెప్పుకునే సర్కార్ తాగేందుకు మంచినీరు కూడా సరిగా అందించలేక పోతోందంటూ మహిళలు మండిపడ్డారు. కలుషిత నీరు రాకుండా లీకేజీలు ఉన్నచోట్ల కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మీ ఇంటికే బీపీ, షుగర్ గోలీలు