టిఫిన్ రెడీ చేయలేమంటున్న మహిళలు

టిఫిన్ రెడీ చేయలేమంటున్న మహిళలు
  • టిఫిన్ రెడీ చేయడంలో ఒత్తిడి ఫీలవుతున్న 84 శాతం తల్లులు
  • వీగార్డు, మామ్స్ ప్రెస్సో.కాం సర్వేలో వెల్లడి
  • బ్రేక్‍ఫాస్ట్.. వండటం ఇష్టంలేదన్న 80 శాతం మంది
  • ఫ్యామిలీ మెంబర్స్ సాయం చేయట్లేదని 60% మంది ఫిర్యాదు
  • హైదరాబాద్​లో కలిసి టిఫిన్ చేసేది 25 శాతం మందే

‘‘పొద్దుగాల్నె లేవాలె.. రాత్రి తిని పడేసిన బాసాండ్లు తోమాలె.. నాస్తా రెడీ చేయాలె.. బిడ్డలు, ఇంటాయనకు సద్ది కట్టాలె.. అబ్బబ్బ మస్తు తక్లిఫ్ అయితంది” అని లేడీస్ బాధపడుతున్నారు. మార్నింగ్‍ లేవగానే కిచెన్‍లో అడుగుపెట్టడాన్ని 84 శాతం మంది తల్లులు స్ట్రెస్‍ ఫీలవుతున్నారు. ప్రతి 10 మందిలో 8 మంది ఫ్యామిలీ కోసం బ్రేక్‍ఫాస్ట్ ప్రిపేర్‍ చేయడం పెద్ద కష్టంగా ఫీలవుతున్నారు. బ్రేక్‍ఫాస్ట్, లంచ్‍ రెడీ చేయడం చాలా స్ట్రెస్‍ఫుల్‍ యాక్టివిటీగా భావిస్తున్నారు. బ్రేక్‍ఫాస్ట్ తయారు చేయడం ఇష్టమైన కుకింగ్‍ కాదని 80 శాతం ఇండియన్‍ మామ్స్ చెబుతున్నారు. అహ్మదాబాద్‍, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‍, కొచ్చి, కోల్‍కతా, ముంబై, పుణే సిటీల్లో వీగార్డు, మామ్స్ ప్రెస్సో.కాం చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

డిన్నర్‍ ప్రిపేర్‍ చేయడాన్ని 38 శాతం, ఈవెనింగ్‍ స్నాక్స్ తయారు చేయడాన్ని 25 శాతం, లంచ్‍ ప్రిపేర్‍ చేయడాన్ని 16 శాతం మామ్స్ ఇష్టమైన కుకింగ్‍ కాదని అభిప్రాయపడ్డారు. ప్రతి 10 మంది మామ్స్ లో ముగ్గురు మాత్రమే బ్రేక్‍ఫాస్ట్ రెడీ చేయడాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో బ్రేక్‍ఫాస్ట్ లో అనేక రకాల ఐటమ్స్ ని ప్రిపేర్‍ చేయాలనుకుంటున్నామని, కానీ చేసేందుకు టైం దొరకడం లేదని 80 శాతం మంది చెబుతున్నారు.

డైలీ ఇవేనా..

సేమ్‍ బ్రేక్‍ఫాస్ట్ ఐటమ్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు, అయిష్టంగా తింటున్నట్లు, రోజు ఒకేటే బ్రేక్‍ఫాస్ట్ అని అంటున్నట్లు ప్రతి 10 మందిలో 8 మంది మహిళలు అభిప్రాయపడ్డారు. కుకింగ్‍ ట్యూటోరియల్స్ చూసి కొత్త ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు 71 శాతం మంది తెలిపారు. బ్రేక్‍ఫాస్ట్ ప్రిపేర్‍ చేసే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తే బాగుంటుందని 80 శాతం మంది భావిస్తున్నారు. బ్రేక్‍ఫాస్ట్ ప్రిపరేషఈన్‍లో ఫ్యామిలీ మెంబర్స్ సాయం అందడం లేదని ప్రతి 10 మందిలో ఆరుగురు చెబుతున్నారు. తమ భర్త కిచెన్‍ లో సాయం చేయాలని కోరుకుంటున్నారు.

టిఫిన్లు కట్టడం బిగ్‍ టాస్క్

టిఫిన్ ప్రిపేర్‍ చేసేందుకు వెజిటబుల్స్ కట్‍ చేయడాన్ని 69 శాతం మంది స్ట్రెస్‍తో కూడిన టాస్క్ గా పేర్కొన్నారు. ఇంటిని, కిచెన్‍ని క్లీన్ చేయడం కష్టమైన పని అని 54 శాతం మంది అంటున్నారు.

మార్నింగ్‍ టైంలో పిల్లలు, భర్తకు టిఫిన్లు కట్టడం బిగ్‍ టాస్క్ అని ప్రతి 10 మందిలో 8 మంది ఫీలవుతున్నారు. పిల్లలను స్కూళ్లకు రెడీ చేయడాన్ని 65 శాతం మంది బిజీ వర్క్​గా భావిస్తున్నారు. బట్టలు ఉతకడాన్ని కేవలం 28 శాతం మామ్స్ మాత్రమే కష్టంగా భావిస్తున్నట్లు సర్వే ఫలితాలు తేల్చాయి.

ఏం చేయాలో తేల్చుకోవడమే బిగ్‍ చాలెంజ్‍

బ్రేక్‍ఫాస్ట్, లంచ్‍లో ఏ ఐటమ్స్ ప్రిపేర్‍ చేయాలో తేల్చుకోవడమే పెద్ద చాలెంజింగ్‍గా భావిస్తున్నట్లు 30 శాతం మంది మహిళలు చెప్పారు. బ్రేక్‍ఫాస్ట్, లంచ్‍లలో డిఫరెంట్‍ ఐటమ్స్ ఉండాలని ఫ్యామిలీ మెంబర్లు కోరుతున్నారని 13 శాతం మంది తెలిపారు. కుకింగ్‍ తర్వాత కిచెన్‍ క్లీనింగ్‍కు చాలా సమయం పోతోందని 12 శాతం మంది చెప్పారు. టిఫిన్‍, లంచ్‍, డిన్నర్‍ కోసం ఐటమ్స్ ని బయటి నుంచి తెప్పిస్తున్నట్లు 22 శాతం మంది తెలిపారు. వీకెండ్స్ లో మాత్రమే టోటల్‍గా బయటి ఫుడ్‍నే తింటున్నట్లు 3 శాతం మంది చెప్పారు.

సర్వే ఇలా..

వివిధ రంగాలకు చెందిన, ఒక సంతానం ఉన్న 535 మంది తల్లులను ఎంపిక చేసి సర్వే చేపట్టారు. ఇందులో 33 శాతం మంది వర్కింగ్‍ ఉమెన్స్, 66 శాతం హోమ్‍ మేకర్స్ ఉన్నారు. 57 శాతం న్యూక్లియర్‍ ఫ్యామిలీస్‍, 42 శాతం జాయింట్‍ ఫ్యామిలీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 36–45 ఏజ్‍ గ్రూప్‍ మామ్స్ 23 శాతం, 25–35 ఏజ్‍ గ్రూప్‍ మామ్స్ 77 శాతం సర్వేలో పాల్గొన్నారు.

కలిసి బ్రేక్‍ఫాస్ట్ చేసేది 41 శాతమే

డైలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బ్రేక్‍ఫాస్ట్ తీసుకుంటున్నట్లు 41 శాతం మహిళలు చెప్పారు. వీకెండ్స్ లో మాత్రమే కలిసి ఇంట్లో బ్రేక్‍ఫాస్ట్ చేస్తున్నట్లు 21 శాతం, వారంలో 2–3 సార్లు చేస్తున్నట్లు 19 శాతం, 4–5 సార్లు చేస్తామని 14 శాతం మంది, వారానికి ఒక్కసారి మాత్రమే కలిసి తింటామని 3 శాతం, అసలు కలిసి బ్రేక్‍ఫాస్టే చేయమని 2 శాతం మంది మామ్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డైలీ కలిసి బ్రేక్‍ ఫాస్ట్ చేస్తామని చెప్పిన వారిలో కొచ్చి, అహ్మదాబాద్‍ (57 శాతం) ఫస్ట్ ప్లేస్‍లో ఉండగా తర్వాతి స్థానాల్లో ముంబై (48 శాతం), బెంగళూరు (46 శాతం), ఢిల్లీ (43 శాతం), చెన్నై (35 శాతం), పుణే(26 శాతం), హైదరాబాద్‍ (25 శాతం) ఉన్నాయి.

సోషల్‍ మీడియాలో షేరింగ్‍

తమ కుకింగ్‍ ఎక్స్​పీరియెన్స్ ఫొటోలు, వీడియోలను సోషల్‍ మీడియాలో షేర్ చేస్తామని 80 శాతం మంది మామ్స్ తెలిపారు. 53 శాతం మంది మాత్రం వండిన ఫుడ్‍ ఫొటోలను మాత్రమే సోషల్‍ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుకింగ్‍ చేసే సమయంలో తీసిన వాటిని పోస్టింగ్‍ చేస్తున్నట్లు 42 శాతం, కుకింగ్‍ వీడియోలను అప్‍లోడ్‍ చేస్తున్నట్లు 26 శాతం మామ్స్ చెప్పారు. షేరింగ్‍కు వాట్సాప్‍ను 79 శాతం, ఇన్‍స్టాగ్రామ్‍ని 65 శాతం, ఫేస్‍బుక్‍ని 55 శాతం, యూట్యూబ్‍ని కేవలం 12 శాతం, టిక్‍టాక్‍ని 5 శాతం ఉపయోగిస్తున్నారు.