తిరుమల సమాచారం : జూలై నెలలో కొండపై శ్రీవారి ఉత్సవాలు ఇవే

తిరుమల సమాచారం : జూలై నెలలో కొండపై శ్రీవారి ఉత్సవాలు ఇవే

కలియుగ వైకుంఠం తిరుమల బ్రహ్మోత్సవాలకు, విశేష ఉత్సవాలకు పెట్టింది పేరు. జులై నెల వస్తోందంటే తిరుమలలో విశేష ఉత్సవాలు అంబరాన్నంటుతాయనే చెప్పాలి. ఈ ఏడాది కూడా జులై నెలలో విశేష ఉత్సవాలు జరపనున్నట్లు వెల్లడించింది టీటీడీ. ఈ మేరకు మంగళవారం ( జూన్ 24 ) స్వామివారి విశేష ఉత్సవాల షెడ్యూల్ రిలీజ్ చేసింది టీటీడీ.జులై 5న మొదలు కానున్న ఉత్సవాలు జులై 30 వరకు ఘనంగా జరగనున్నాయని తెలిపింది టీటీడీ

జులై నెలలో శ్రీవారి విశేష ఉత్సవాల లిస్ట్ ఇదే:

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

  • జులై  5న పెరియాళ్వార్ శాత్తుమొర.
  • జులై  6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
  • జులై  7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
  • జులై 10న గురు పౌర్ణమి గరుడసేవ.
  • జులై  16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.
  • జులై  25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • జులై  28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
  • జులై  29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
  • జులై  30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి విశేష ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీవారి కృపాకటాక్షాలు పొందాలని తెలిపింది టీటీడీ.