
- సామల సుగుణను సత్కరించిన సభ్యులు
పద్మారావునగర్, వెలుగు: లింగ వివక్ష లేని సమాజంతో మహిళలకు సమన్యాయం కలుగుతుందని, గతంతో పోల్చితే ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఉమెన్స్‌డే పురస్కరించుకొని పెన్గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని రాజరాజేశ్వరి గార్డెన్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన మహిళలను ఘనంగా సత్కరించారు.
అంతర్జాతీయ మెజిషీయన్, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంటర్ సామల వేణు మాతృమూర్తి సామల సుగుణను పెన్గ్రూప్ ప్రతినిధులు, ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. సామల సుగుణ నేటి తరం మహిళలకు ఆదర్శమని కొనియాడారు. ప్రముఖ మెజిషీయన్సామల వేణు, ఈవెంట్ చైర్మన్ వంగల శైలజ, కార్పొరేటర్ కొంతం దీపిక, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్అధినేత మల్కా పల్లవి, మహిళలు పాల్గొన్నారు.