ఎమ్మెల్సీ కవితకు అర్వింద్ క్షమాపణ చెప్పాలి: మహిళా సంఘాల మౌనదీక్ష

ఎమ్మెల్సీ కవితకు అర్వింద్ క్షమాపణ చెప్పాలి: మహిళా సంఘాల మౌనదీక్ష

ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్యాంక్ బండ్ పై ఉన్న రాణిరుద్రమదేవి విగ్రహం ముందు మహిళా సంఘాలు మౌనదీక్ష చేస్తున్నాయి.ఎంపీ అర్వింద్ కవితకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తు్న్న అర్వింద్ నకిలీ హిందువు అంటూ వారు వ్యాఖ్యలు చేశారు.  

కవిత పై వాఖ్యలు చేస్తే.. స్పందించని గవర్నర్.. అర్వింద్ ఇంటి పై దాడి చేస్తే ఎలా స్పందించారని మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అర్వింద సమేత తమిళసై.. నినాదంతో నిరసనలు చేస్తామన్నారు. ఉద్యమకారిని.. కవితక్క పై వాఖ్యలు చేస్తే ఊరుకోమన్నారు. అర్వింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.