నవంబర్ 1 నుంచి మహిళల టీ-20 క్రికెట్

నవంబర్ 1 నుంచి మహిళల టీ-20 క్రికెట్

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగబోయే మహిళల టీ20 చాలెంజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని ఇండియా ఉమెన్స్ (టీ20) టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పింది.ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరిగే టైమ్ లో మూడు జట్లతో ఉమెన్స్ టీ20 చాలెంజ్ నిర్వహిస్తామని లీగ్​ గవర్నింగ్​ కౌన్సిల్ ఇటీవల ప్రకటించింది. నవంబర్ 1-10 తేదీల్లో ఈ మ్యాచ్ లు జరిగే అవకాశముంది.

‘ఉమెన్స్ టీ20 చాలెంజ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎందుకుంటే ఇదివరకు ఎప్పుడూ దుబాయ్ లో మేము ఆడలేదు. అక్కడి వికెట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది. కొత్త వాతావరణం కాబట్టి ప్లేయర్లంతా తమ సామర్థ్యానికి తగిన విధంగా నేచురల్ గేమ్ ఆడాలి. ప్లేయర్లంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పురుషుల ఐపీఎల్ మాదిరిగా మహిళల ఐపీఎల్ ను కూడా త్వరలోనే చూస్తాం. నాలుగు మ్యాచ్ లే అయినా అందరినీ ఎంటర్ టైన్ చేస్తామనే నమ్మకముంది’ అని హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది. ఉమెన్స్ టీ20 చాలెంజ్ ఉండడంతో ఇండియన్ ప్లేయర్లు మహిళల బిగ్​బాష్ లీగ్ (డబ్ల్యూ బీబీఎల్ )పై ఆసక్తి చూపడం లేదు.