
చెన్నై: ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి.. విమెన్స్ స్పీడ్ చెస్ చాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో వైశాలి 6–8తో అలైస్ లీ (అమెరికా) చేతిలో ఓడింది. ఈ విజయంతో లీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. హోరాహోరీగా సాగిన గేమ్‌లో ఆరంభంలో వైశాలి ఆధిక్యంలో ఉన్నా.. లీ అద్బుతమైన ఎత్తులతో నిలువరించింది.
ఇక ఫిడే వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ గెలిచి గ్రాండ్ మాస్టర్‌గా మారిన దివ్య దేశ్‌ముఖ్ ఈ నెల 11న జరిగే తొలి రౌండ్‌లో చైనా గ్రాండ్ మాస్టర్ లీ టింగ్జీతో తలపడుతుంది. ఈ ఆన్‌లైన్ ఈవెంట్‌లో 16 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. ఎనిమిది మంది నేరుగా క్వాలిఫై కాగా, మరో ఎనిమిది మందిని ఆహ్వానించారు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అన్ని మ్యాచ్‌ల్లో మూడు విభాగాలు ఉంటాయి. ఓపెనింగ్ రౌండ్, క్వార్టర్‌ఫైనల్స్. ఇందులో 5+1, 3+1 గేమ్‌లు ఉంటాయి. 5+1 గేమ్‌లో వైశాలి మూడు విజయాలు, ఒక డ్రాతో 3.5–0.5 లీడ్‌లో నిలిచింది. అయితే 3+1 కేటగిరీలో లీ నాలుగు విజయాలు సాధించింది.