ఐటీ ఎంప్లాయిస్ కు డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఐటీ ఎంప్లాయిస్ కు డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్

హైదరాబాద్, వెలుగుసిటీలో అన్‌లాక్‌ రిలాక్సేషన్స్​ పెరిగినా ఐటీ ఎంప్లాయిస్ మాత్రం డిసెంబర్​ దాకా వర్క్​ ఫ్రమ్​ హోం కంటిన్యూ చేయనున్నారు. మెట్రో రైల్‌ రీసార్ట్​ అయితే ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటారని కొందరు భావించినా, అన్‌లాక్‌ 4 గైడ్‌లైన్స్​కి ముందే కంపెనీలు సెప్టెంబర్‌ చివరిదాకా వర్క్‌ ఫ్రమ్‌ హోం ప్రకటించాయి. ఇప్పుడు దాన్ని డిసెంబర్‌ వరకూ పొడిగించాయి. విప్రో, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, కాపీజెమినీ, ఆక్యువేట్‌లాంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఇయర్​ ఎండ్​దాకా వర్క్​ ఫ్రమ్‌ హోం చేయాలని తమ ఉద్యోగులకు చెప్పేశాయి. కొన్ని కంపెనీలు అక్టోబర్‌ వరకు పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. ఆయా కంపెనీల ఉద్యోగులు మాత్రం వ్యాక్సిన్‌ వచ్చాకే తాము ఆఫీసులకు వచ్చి పని చేస్తామని రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు. పెద్ద కంపెనీల నిర్ణయం చూసి చిన్న కంపెనీలు కూడా డిసెంబర్‌ వరకు మినహాయింపు ఇస్తున్నట్లు ఐటీ ఎంప్లాయ్స్​ చెప్తున్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత కూడా 50 శాతం ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. వైరస్‌ పూర్తిగా ఇనాక్టివ్‌ అయ్యాకే అందరినీ పిలవానుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు పూర్తి అన్‌లాక్‌కు వెళ్లడంతో ప్రాజెక్టులను త్వరగా ఫినిష్‌ చేయాలనే ఒత్తిడిలో కంపెనీలున్నాయి. అందుకే ఎక్కడి నుంచైనా సరే.. టార్గెట్స్ ​కంప్లీట్​ చేస్తే చాలన్న ఆలోచనలో ఉన్నాయి.

కరోనా కంట్రోల్​ అవ్వకపోవడంతో..

రాష్ర్టంలో కరోనా కేసులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటీ ఎంప్లాయిస్​​ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్నారు. తిరిగి ఎప్పుడు ఆఫీసుకి రావాలో తామే చెప్తామని, అప్పటిదాకా ఇంటి నుంచే పని చేయాలని కంపెనీలు చెప్పాయి. కరోనా కంట్రోల్​లోకి రాకపోవడంతో అదే కంటిన్యూ చేస్తున్నాయి. ఐటీ ఎంప్లాయిస్​ కూడా ఇంటి నుంచి పని చేసేందుకే ఇష్టపడుతున్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్​తో ఎక్కువమంది విసిగిపోయినా.. ట్రాఫిక్​ ఇబ్బందులు, వైరస్‌తో ఎక్స్‌పోజర్‌ ఉండదని ఇంటి నుంచే పని చేస్తామంటున్నారు.

వెళ్లొద్దని ఇంట్లో వాళ్ల ఒత్తడి

కరోనా కేసులు పెరుగుతుండడం, వ్యాక్సిన్​ ఇంకా రాకపోవడంతో చాలామంది భయంతో ఉన్నారు. ఐటీ కంపెనీలు, ఎంప్లాయిస్​​లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వ్యాక్సిన్​ కోసం వెయిట్​ చేస్తున్నారు. ఏడాది చివరికల్లా వస్తుందని భావిస్తూ, అదివచ్చాక ఆఫీస్​కి వెళ్లడం సేఫ్‌ అని ఫీల్​ అవుతున్నారు. ఎంప్లాయిస్​ అప్పటివరకు రాలేమని కంపెనీలకు చెప్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వెళ్లొద్దని ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు తెలిపారు. కంపెనీలు ఓకే చెప్పడంతో ఊపిరి పీల్చుకొని ఇంటి నుంచే పని చేస్తున్నారు. కంపెనీలు కూడా రిస్క్‌ తీసుకోవద్దని ఈ ఫ్లెక్సిబులిటీ ఇచ్చాయి.

వ్యాక్సిన్ వచ్చే వరకు వెళ్లేది లేదు

కరోనాకి వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఆఫీస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. రిస్క్‌ తీసుకోవద్దని ఇంట్లో వాళ్లు అంటున్నారు. మా ఆఫీసు వాళ్లకు ఇదే విషయం చెప్పాం. వర్క్ ​ఫ్రమ్​హోమ్​ కంటిన్యూ చేసేందుకు ఓకే చెప్పారు.

‑ దివ్య, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​, గచ్చిబౌలి

డిసెంబర్ వరకు ఓకే

మా కంపెనీ వాళ్లు డిసెంబర్‌ వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్​ చేయాలని మెయిల్ ​పంపారు. ఆ మెసేజ్​తో ఊపిరి పీల్చుకున్నాం. కరోనా తగ్గాకే ఆఫీసుకు వెళ్లాలని డిసైడ్‌ అయ్యా. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్​ కన్వీనియంట్‌గానే ఉంది.

‑ నిఖిల, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​, మాదాపూర్