కొత్త రూల్ : ఏడాది మాత్రమే వర్క్ ఫ్రం హోం

కొత్త రూల్ : ఏడాది మాత్రమే వర్క్ ఫ్రం హోం

వర్క్ ఫ్రం హోంపై కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది.స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) పరిధిలోని ఉద్యోగులు ఏడాది మాత్రమే వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకు అనుమతినిచ్చింది. SEZ రూల్స్ 2006 లో 43A ని కేంద్రం నోటిఫై చేసింది.  అన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కు  వర్క్ ఫ్రం హోం పాలసీని అందులో పేర్కొంది. దేశం మొత్తం కలిపి యూనిఫాం పాలసీని తీసుకరావాలన్న ఇండస్ట్రీ వర్గాల విజ్ఞప్తితో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ రూల్ ప్రకారం ప్రత్యేక కేటగిరి చెందినవారు మాత్రమే వర్క్ ఫ్రం హోంకి అర్హులు. ప్రయాణాల్లో ఉన్నవారు, తాత్కాలికంగా ఉద్యోగానికి వెళ్లలేనివారు, ఆఫ్సైట్ ఉద్యోగులు ఈ కేటగిరిలోకి వస్తారు.  కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ తో కలుపుకుని 50శాతం మందికే వర్క్ ఫ్రం హోం కల్పించొచ్చు. అంతకుమించి ఇవ్వాలనుకుంటే SEZ ఆఫీసర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలుంటుంది. ఆ తర్వాత కూడా కావాలనుకుంటే సెజ్ ఆఫీసర్ పర్మిషన్ తప్పనిసరి. ఒకవేళ ఆయన ఓకే అంటే మరో ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే సెజ్ ల పరిధిలో ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తుంటే 90 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.