వర్క్ ఫ్రమ్ హోమ్.. వద్దు గురూ..!

వర్క్ ఫ్రమ్ హోమ్.. వద్దు గురూ..!

ఆఫీసే బెటర్ అంటున్న ఎంప్లాయీస్

కంటిన్యూస్ వర్క్ తో ఫుల్ స్ట్రెస్

పెరుగుతున్న వర్కింగ్ అవర్స్

నో బ్రేక్స్.. నో హాలిడేస్

కొలిగ్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్

సతాయిస్తున్న నెట్ వర్క్ ప్రాబ్లంస్ 

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ముందు నుంచే సిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. జనతా కర్ఫ్యూ తర్వాత దాదాపు అన్ని కంపెనీలు ఇంటి నుంచే ఎంప్లాయీస్ తో పని చేయిస్తున్నా యి. అప్పటిదాకా ఆఫీస్ తో విసిగిపోయిన వాళ్లకు మొదట్లో ఇది బాగానే ఉంది. వర్క్ తోపాటు ఫ్యామిలీకి టైం కేటాయించొచ్చని సంబరపడ్డారు. ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్.. అంటే వామ్మో అంటున్నారు. ఆఫీసులో చేసే పని కంటే రెండింతలు ఎక్కువ ఇస్తుండడంతో ఒత్తిడికి గురవుతున్నారు. వర్కింగ్ అవర్స్ పెరగడంతో స్ట్రెస్ ఎక్కువవుతోందని వాపోతున్నా రు. హాలీ డేస్ అన్నవే మర్చి పోయామని, వర్క్ మధ్యలో బ్రేక్ కూడా దొరకడం లేదని చెప్తున్నా రు.

వర్క్ ఎన్విరాన్మెంట్ లేక..

ఇంట్లో వర్కింగ్ ఎన్విరా న్మెంట్ ఉండటం లేదని, ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతోందని ఎంప్లాయీస్ వాపోతున్నా రు. ఆఫీసులో అయితే పని చేసే వాతావరణం, కొలిగ్స్ ఉంటారు. రిలాక్స్ అయ్యేందుకు టైమ్ దొరుకుతుంది. ఇంట్లో ఆ పరిస్ థితి ఉండదు. మార్నింగ్ లాగిన్ అయితే రాత్రి దాకా మీటింగ్స్, క్లైంట్స్ కాల్స్ తోనే సరిపోతోంది. ఆఫీస్ టైమిం గ్స్ కి మించి రెండు, మూడు గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. ఇంట్లో వాళ్లకి కూడా టైం ఇవ్వలేకపోతున్నారు. ఆఫీసులో వర్క్ మధ్యలో బ్రేక్స్ ఉండడం వల్ల కాస్త రిలాక్స్ అయ్యే వారు. ఇప్పుడు ఇంట్లో గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చుని పని చేస్తుండడంతో విసుగెత్తున్నారు. బ్యాక్ పెయిన్, కంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు.  డైలీ 7–8గంటలు వర్క్ చేస్తున్నా కొన్ని కంపెనీలు వీక్ ఆఫ్, లీవ్ లు కూడా ఇవ్వడం లేదు. శని, ఆదివారాల్లోనూ ఆఫీస్ వర్క్ తోనే గడిపేస్తున్నారు చాలామంది. నెట్ వర్క్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి.

పీక్స్ లో ప్రెజర్

ఆఫీస్ తో పోలిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 50% నుంచి 80% ప్రెజర్ పెరిగిందంటున్నారు ఉద్యోగులు. ప్రాజెక్స్ట్ డెడ్ లైన్స్, ప్రొఫెషనల్ మీటింగ్స్, కైంట్స్ కాల్స్ తో తీరిక ఉండటం లేదని, మెంటల్ ప్రెజర్ పెరిగిపోతుందని వాపోతున్నా రు. ఆ స్ట్రెస్ ని ఇంట్లో వాళ్ల మీద, పిల్లల మీద తెలియకుండానే చూపిస్తున్నామంటూ బాధ పడుతున్నారు. ఇన్ని నెలల గ్యాప్ వల్ల కొలిగ్స్ తోనూ కమ్యూని కేషన్ మెయిం టెన్ చేయలేకపోతున్నామని, ఆ టైం కూడా ఉండటం లేదని పలువురు చెప్తున్నా రు. వీడియో కాన్ఫరెన్స్ లలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్లు రావడం, పిల్లలు అల్లరి చేయడం వల్ల మేనేజ్మెం ట్ నుంచి చీవాట్లు తింటున్న వాళ్లూ చాలామందే ఉన్నారు.

ఆఫీస్ లోనే బాగుంది..

మా ఆఫీస్ టైమింగ్స్ ఉదయం 10గంటల నుంచి ఈవెనింగ్ 7 గంటల వరకు. అందులో రెండు గంటలు లంచ్, స్నాక్స్, టీ బ్రేక్ కి పోయేవి. అందరం ఒకేచోట ఉండి వర్క్ చేస్తాం కాబట్టి ఏ డౌట్ వచ్చినా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకునే వాళ్లం. వర్క్ ప్రెజర్ ఉన్నా కొలీగ్స్ మాట్లా డుతుంటే రిలాక్స్ అయ్యేవాళ్లం. వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఆ పరిస్థితి లేదు. సండే కూడా పని చేయాల్సి వస్తోంది. 9–10 గంటల డ్యూటీతోపాటు ఫాలో అప్ కూడా ఉంటోంది. ఫ్యామి లీతో సరదాగా గడిపి నెలలు అవుతోంది. బ్యాక్ పెయిన్ కూడా మొదలైంది. – సునీల్, సీనియర్ అకౌంటెంట్ మేనేజర్

 

స్ట్రెస్ ఎక్కువవుతోంది

కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఆప్షనే అయినా స్ట్రెస్ ఎక్కువవుతోంది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. సపోర్టివ్ టీం ఉంటుంది. ఇంట్లో అయితే మనమే చేసుకోవాలి. క్లైంట్స్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఏదో ఒక డిస్ట్రబెన్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను. సపరేట్ రూమ్ లో ఉండి వర్క్ చేసుకుంటున్నా, పిల్లలను ఆపలేం కదా. కంటిన్యూస్ వర్క్ వల్ల బాడీ పెయిన్స్, తలనొప్పి ఎక్కువవుతున్నాయి. – సంజన, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్.