ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

వెలుగు, నెట్​వర్క్​ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్​లో కుమ్రం భీమ్​, రాంజీ గోండ్ విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ‌‌లో బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని పోడు భూముల సమస్య ఇంకా నెరవేరలేదని అన్నారు. 

ఉట్నూర్ లో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కుమ్రం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీమ్ చౌక్ లోని కుమ్రం భీమ్ విగ్రహం దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ స్వచ్ఛభారత్ నిర్వహించి, బీజేపీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్​లో కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ సురేశ్​కుమార్, నివాళులర్పించారు. బజార్ హాత్నూర్, ఖానాపూర్​, పెంబి, జైనూర్​లో ఆయా గ్రామాల ప్రజలు వేడుకలను ఘనంగా నిర్వహించారు.