ఇంగ్లండ్ Vs సౌతాఫ్రికా : ఆరంభంలోనే వికెట్

ఇంగ్లండ్ Vs సౌతాఫ్రికా : ఆరంభంలోనే వికెట్
  • వరల్డ్ కప్ 2019 లో తాహిర్ ఖాతాలో తొలి వికెట్ 

ఇంగ్లండ్ లో వన్డే ప్రపంచకప్‌ 2019 ప్రారంభమైంది.  లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా లోకల్ టీమ్ ఇంగ్లండ్‌… దక్షిణాఫ్రికా మధ్య ఫస్ట్ ఫైట్ జరుగుతోంది.

టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌ కు ఆహ్వానించాడు.

ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికే స్టార్ ఓపెనర్, ఐపీఎల్ స్టార్ బెయిర్ స్టో డకౌట్ అయ్యాడు. వరల్డ్ కప్ లో తొలి వికెట్ ను ఇమ్రాన్ తాహిర్ పడగొట్టాడు. ఆ తర్వాత.. జాసన్ రాయ్, రూట్ వేగంగా పరుగులు రాబట్టారు.

రెండు దేశాల టీంలు:

దక్షిణాఫ్రికా జట్టు: హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, అయిడెన్‌ మార్క్రం, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), రస్సీ వాన్‌ దర్‌ డుస్సెన్‌, జేపి డుమిని, అండిలే ఫెలుక్వాయో, డ్వైన్‌ ప్రిటోరియస్‌, రబాడా, లుండి ఎన్గిడి, ఇమ్రాన్‌ తాహిర్‌

ఇంగ్లండ్‌ జట్టు: జాసన్‌ రాయ్‌, జోరూట్‌, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌