ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వరల్డ్ కప్ గణపతి

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వరల్డ్ కప్ గణపతి

ఒక పక్క అభిమానం, మరోపక్క దేవుడిపై భక్తిని వినాయక రూపాల్లో కనిపించేలా విగ్రహ ఏర్పాటులో చేస్తుంటారు కొందరు భక్తులు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనతో ఆకట్టుకుంటారు. నవరాత్రి సమయంలో మండప నిర్వాహకులు వివిధ రకాల కన్సెప్ట్ లతో గణనాథుడి ప్రతిమలు ప్రతిష్టించి పూజిస్తుంటారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ తన క్యాంప్ కార్యాలయంలో వరల్డ్ కప్ గణేషున్ని ఏర్పాటు చేశారు. ఈ గణపతి పట్టణంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణనాథుడు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్న విధంగా మండపం ముందు సెటప్ ఏర్పాటు చేశారు. 

వరల్డ్ కప్ 2023 నమూనతో గణనాథుడిని ప్రతిష్టించి వారం రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అందుకే వరల్డ్ కప్ 2023 నమూనాతో గణనాథుడి మండపం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.