
ఇంగ్లండ్ లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌కు వెళ్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందన్నారు. తాజాగా… గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్న సుందర్ పిచాయ్ క్రికెట్ మాట్లాడారు. తనను తాను ఓ క్రికెట్ అభిమానిగా చెప్పుకున్నారు. ప్రపంచకప్ ఫైనల్ పోరు భారత్-ఇంగ్లండ్ మధ్యే ఉంటుందన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా చాలా సమర్ధవంతమైన జట్లని కూడా చెప్పారు. ఫైనల్ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.