ఈసారి ప్రపంచకప్ భారత్‌కే రాబోతుందని జోస్యం చెప్పాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.ముంబైలోని ఎంఐజీ గ్రౌండ్ లో సచిన్ పేరుతో పెవిలియన్ ఎండ్‌ను ప్రారంభించారు. మే 30 నుండి జరిగే ఈ ప్రపంచకప్ పూర్తి వేసవిలో జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సచిన్… ఎండల ప్రభావానికి పిచ్‌లు ప్లాట్‌గా మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సౌకర్యంగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లాండ్ వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు. ఇక బ్యాటింగ్ విషయంలో భారత బ్యాట్స్‌మెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్‌పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మంచి ఫాంలో ఉన్నారన్నారు. వీరంతా ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నారు. ఒక క్రికెటర్ ఏ ఫార్మాట్‌లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈసారి ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్ జట్టు అనడంలో సందేహం లేదుగా అని అన్నాడు సచిన్.
