World Cup2023: వరల్డ్​కప్​లో అదిరింది తొలిదెబ్బ

World Cup2023:  వరల్డ్​కప్​లో అదిరింది తొలిదెబ్బ
  •     చెలరేగిన రాహుల్‌‌‌‌, కోహ్లీ
  •     రాణించిన జడేజా, కుల్దీప్‌‌‌‌, బుమ్రా

ఆస్ట్రేలియా ఇచ్చిన 200 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్లు ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ చేసిన స్కోర్లు. రెండు ఓవర్లు ముగిసే సరికి స్కోరు 2/3.ఈ పరిస్థితిలో మన టీమ్‌‌‌‌‌‌‌‌ వంద కూడా కొట్టడం కష్టమే.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను ఓటమితో  ప్రారంభించడం ఖాయమే అనుకుంటున్న సమయంలో  కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ (115 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 97 నాటౌ ట్‌‌‌‌‌‌‌‌), సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (116 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లతో 85) అద్భుతం చేశారు. కష్టమైన పిచ్‌‌‌‌‌‌‌‌పై కంగారూల ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను కసితీరా కొట్టేశారు. దాంతో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌  వేటను ఇండియా ఘన విజయంతో షురూ చేసింది.

చెన్నై: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ను టీమిండియా సూపర్ విక్టరీతో స్టార్ట్‌‌‌‌‌‌‌‌  చేసింది. బౌలర్లతో పాటు కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌,విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ,  ఖతర్నాక్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన వేళ  చెపాక్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 6  వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (46), డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌ (41) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్లు. ఇండియా బౌలర్లలో జడేజా (3/28) మూడు, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (2/42), బుమ్రా (2/35) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 41.2   ఓవర్లలో  201/4   స్కోరు చేసి గెలిచింది. కోహ్లీ, కేఎల్‌‌‌‌‌‌‌‌ నాలుగో వికెట్​కు 165 రన్స్​ జోడించారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ మూడు వికెట్లు తీశాడు. రాహుల్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు దక్కింది. 11న ఢిల్లీలో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో రోహిత్‌‌‌‌‌‌‌‌సేన పోటీ పడనుంది.

కోహ్లీ క్లాస్​, రాహుల్​ గ్రేస్

వరుసగా ముగ్గురు సున్నా చుట్టినా విరాట్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ క్లాసిక్​ బ్యాటింగ్​తో టీమిండియా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఈజీగానే కరిగించింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఆసీస్‌‌‌‌‌‌‌‌ పేసర్లు హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను వణికించారు. డెంగ్యూతో ఇబ్బంది పడుతున్న గిల్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ఇషాన్‌‌‌‌‌‌‌‌ (0)  ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌కే స్టార్క్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను వెంటాడి స్లిప్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్‌‌‌‌‌‌‌‌కు చిక్కాడు.

తర్వాతి ఓవర్లో హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. తొలుత ఓ ఇన్‌‌‌‌‌‌‌‌స్వింగర్‌‌‌‌‌‌‌‌తో రోహిత్‌‌‌‌‌‌‌‌ (0)ను ఎల్బీ చేశాడు. ఆ వెంటనే వైడ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను కవర్స్‌‌‌‌‌‌‌‌లో నేరుగా వార్నర్‌‌‌‌‌‌‌‌ చేతుల్లోకి కొట్టిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (0)కూడా సున్నా చుట్టాడు. దాంతో స్టేడియం మొత్తం సైలెంట్‌‌‌‌‌‌‌‌ అయింది. ఈ దశలో కోహ్లీ, కేఎల్‌‌‌‌‌‌‌‌ జట్టును ఆదుకున్నారు. ఎనిమిదో ఓవర్లో హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ బ్యాట్‌‌‌‌‌‌‌‌కు తగిలి గాల్లోకి లేచింది.  క్యాచ్‌‌‌‌‌‌‌‌ పట్టేందుకు కీపర్‌‌‌‌‌‌‌‌తో పాటు రన్నింగ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటూ వచ్చిన మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేయడంతో కోహ్లీతో పాటు టీమ్‌‌‌‌‌‌‌‌,  ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో టర్నింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ అయింది. 12 రన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద లభించిన ఈ లైఫ్‌‌‌‌‌‌‌‌ను సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. కేఎల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను గాడిలో పెట్టాడు. ప్రత్యర్థికి మరో చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా క్లాసిక్​ షాట్లతో బౌండ్రీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించారు. పేసర్లతో పాటు స్పిన్నర్లు జంపా, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ను కూడా పక్కాగా ఎదుర్కొన్న  ఈ  ఇద్దరూ వరుస ఓవర్లలో ఫిఫ్టీలు పూర్తి చేసుకోవడంతో పాటు 35 ఓవర్లలో స్కోరు 150 దాటించి విజయం ఖాయం చేశారు. చివరకు 38వ ఓవర్లో కోహ్లీని ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ ఈ జోడీని విడదీశాడు. అప్పటికి ఇండియాకు 33 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అవ్వగా.. వచ్చీరాగానే హార్దిక్‌‌‌‌‌‌‌‌ (11  నాటౌట్‌‌‌‌‌‌‌‌) సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. మ్యాక్సీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో 6,4 బాదిన రాహుల్‌‌‌‌‌‌‌‌.. కమిన్స్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగించాడు.

జడేజా మ్యాజిక్‌‌‌‌‌‌‌‌

చెపాక్‌‌‌‌‌‌‌‌ స్లో వికెట్‌‌‌‌‌‌‌‌పై  సూపర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా స్పిన్నర్లు ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.  సీఎస్కే ఆటగాడిగా  ఇక్కడి ట్రాక్‌‌‌‌‌‌‌‌పై పూర్తి పట్టున్న జడేజా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లను దెబ్బకొట్టాడు. ఇండియా బౌలర్లు మొత్తం176 డాట్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌తో కట్టడి చేశారు.  మూడో ఓవర్లోనే  ఓ ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (0)ను డకౌట్‌‌‌‌‌‌‌‌ చేసిన బుమ్రా ఇండియాకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఈ దశలో  వార్నర్‌‌‌‌‌‌‌‌కు తోడైన స్మిత్‌‌‌‌‌‌‌‌ వరుస బౌండ్రీలతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాడు.

అయితే, పిచ్‌‌‌‌‌‌‌‌ను చదివిన రోహిత్‌‌‌‌‌‌‌‌ 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌ నుంచి రెండు ఎండ్ల నుంచి స్పిన్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేయించాడు. 17వ ఓవర్లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌కు వార్నర్‌‌‌‌‌‌‌‌ రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో  రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 69 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ అయింది. స్మిత్‌‌‌‌‌‌‌‌కు తోడైన లబుషేన్‌‌‌‌‌‌‌‌ (27) జాగ్రత్తగా ఆడుతూ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. అయితే రిథమ్‌‌‌‌‌‌‌‌ అందుకున్న జడేజా స్పీడ్‌‌‌‌‌‌‌‌గా బాల్స్‌‌‌‌‌‌‌‌ వేస్తూ ఈ ఇద్దరినీ ఇబ్బంది పెట్టాడు. ఓ స్ట్రెయిట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌తో వన్డేల్లో పదోసారి స్మిత్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే లబుషేన్‌‌‌‌‌‌‌‌,అలెక్స్‌‌‌‌‌‌‌‌ క్యారీ (0)ని పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చడంతో  ఆసీస్ 119/5తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ (15), గ్రీన్‌‌‌‌‌‌‌‌ (8) ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ , కుల్దీప్‌‌‌‌‌‌‌‌, అశ్విన్‌‌‌‌‌‌‌‌ వారికి ఆ చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. కుల్దీప్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌పై ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అవ్వగా.. అశ్విన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో కట్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ ఆడిన గ్రీన్‌‌‌‌‌‌‌‌.. పాండ్యాకు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. కమిన్స్‌‌‌‌‌‌‌‌ (15)ను బుమ్రా 43వ ఓవర్లో పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు.  పాండ్యా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జంపా (6) ఔటవగా.. చివర్లో విలువైన రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన స్టార్క్ (28)ను సిరాజ్‌‌‌‌‌‌‌‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

15 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ అందుకున్న క్యాచ్‌‌‌‌‌‌‌‌లు. ఇండియా తరఫున అత్యధిక క్యాచ్‌‌‌‌‌‌‌‌లు పట్టిన ఫీల్డర్‌‌‌‌‌‌‌‌గా కుంబ్లే (14) రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 

బ్యాన్ చేసినా వచ్చిండు

క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు తరచూ ఆటంకం కలిగించే ఇంగ్లండ్‌‌‌‌కు చెందిన జార్వో (డానియెల్‌‌‌‌ జార్విస్‌‌‌‌)  ఇండియా–ఆస్ట్రేలియా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చాడు.  ఇండియా జెర్సీ వేసుకొని ఆట మొదలయ్యే  ముందు ఫీల్డ్‌‌‌‌లో ఎంట్రీ ఇచ్చాడు.  కోహ్లీవైపు వెళ్తున్న   జార్వోను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. ఇదివరకు  ఇంగ్లండ్‌‌‌‌లోని చాలా స్టేడియాల్లో ఆటకు ఇబ్బంది కలిగించిన తను గ్రౌండ్‌‌‌‌లోకి రాకుండా ఐసీసీ బ్యాన్‌‌‌‌ చేసింది. అయినా చెపాక్‌‌‌‌ స్టేడియంలో  వీఐపీ టికెట్‌‌‌‌ సంపాదించిన జార్వో ఫీల్డ్‌‌‌‌లోకి రావడంతో భద్రతా లోపం స్పష్టమైంది.

సంక్షిప్త స్కోర్లు

ఆస్ట్రేలియా: 49.3 ఓవర్లలో 199 ఆలౌట్  (స్మిత్‌‌‌‌‌‌‌‌ 46, వార్నర్‌‌‌‌‌‌‌‌ 41, జడేజా 3/28)
ఇండియా: 41.2 ఓవర్లలో 201/4 (రాహుల్‌‌‌‌‌‌‌‌ 97 నాటౌట్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ 85, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ 3/38).