
హైదరాబాద్, వెలుగు: ఆగకుండా 60 గంటలు వంట చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కాడు చెఫ్ శరత్ కుమార్. ఫ్రీడం రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ భాగస్వామ్యంతో ఫ్రీడం కుకింగ్ మారథాన్‌లో వంట చేయగా రికార్డ్ నమోదు చేశారు. నాన్ స్టాల్ కుకింగ్ కార్యక్రమం మంగళవారం బంజారాహిల్స్ లోని ఫ్రీడమ్ హౌజ్ లో జరిగింది. ఇందులో భాగంగా చెఫ్ శరత్ కుమార్ 201డిషెస్ తయారు చేశారు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరారు. ఈ సందర్భంగా ఫ్రీడం రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ – సేల్స్ అండ్ మార్కెటింగ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువ చెఫ్ ల నైపుణ్యాభివృద్ధిని, వారి కలలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ఎఫ్ అండ్ బీ పరిశ్రమలోని ప్రజలు ప్రారంభించిన సృజనాత్మక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ మద్దతును ఫ్రీడం రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ అందిస్తుందని తెలిపారు.