
వెంకటాపూర్( రామప్ప), వెలుగు: రామప్ప టెంపుల్ లో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్స్ క్యాంపు శుక్రవారం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు ట్రస్ట్ డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, ప్రొఫెసర్ అర్జున్ రావు, మాజీ డీజీపీ రతన్ హాజరయ్యారు. ట్రస్ట్ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ దేశంలోని నలుమూలల నుంచి వచ్చి శిక్షణ తీసుకుంటున్న వలంటీర్స్ ని అభినందించారు. అనంతరం శిక్షణ తీసుకున్న వలంటీర్స్ కి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరఫున సర్టిఫికెట్స్, మెమోంటోస్, కీ చైన్స్, తెలంగాణ పిండివంటలను అందజేశారు.
వలంటీర్స్ శిక్షణలో తీసుకున్న అంశాలపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ డీజీపీ రతన్ మాట్లాడుతూ కాకతీయుల కీర్తి ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ప్రొఫెసర్ పాండురంగారావు కృషి చేశారన్నారు. ప్రొఫెసర్లు పాండు రంగారావు, డాక్టర్ కృష్ణ సూర్య కిరణ్, 13 రాష్ట్రాలు, ఇరాన్ దేశం నుంచి వాలంటీర్స్ పాల్గొన్నారు. ట్రస్ట్ సిబ్బంది, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ పర్యటక శాఖ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయానికి నలుగురు టూరిస్ట్ పోలీసులు, మేడారం సమ్మక్క జాతర జాతరకు ఆరుగురు పోలీసులను నియమించింది. శుక్రవారం రామప్ప ఆయానికి నియమించిన నలుగురు పోలీసుల్లో ముగ్గురు విధులకు హాజరయ్యారు.