న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్–2028 చాంపియన్‌షిప్‌కు ఇండియా తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. భువనేశ్వర్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. పోలెండ్‌లోని టోరున్‌లో గురువారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
‘2028 ఏడాదిగాను వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను ఇండియాకు అప్పగించారు’ అని వరల్డ్ అథ్లెటిక్స్ వైస్ ప్రెసిడెంట్ అదిల్లే సుమరివాలా వెల్లడించాడు. మెగా చాంపియన్‌షిప్ కోసం ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండియా తన బిడ్‌ను దాఖలు చేసింది.
వరల్డ్ అథ్లెటిక్స్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం జనవరిలో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం కాంప్లెక్స్‌లో ఉన్న అత్యాధునిక ఇండోర్ సదుపాయాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసింది.
